‘టాక్సిక్’ సినిమాపై బోలెడన్ని ఆశలను పెట్టుకున్న యష్ ఆ సినిమా ఫలితంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయాడు. యష్ బయట కనిపించకుండా మౌనంగా ఉండటం కన్నడ చిత్ర పరిశ్రమలోనూ, ఆయన అభిమానుల్లోనూ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఎంతటి స్టార్ హీరోలకైనా పరాజయాలు కామన్.
కానీ, ఇతర చిత్రాల విజయాలను ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన పని హీరోలపై ఉంటుంది. ఇటీవల కన్నడలో చిన్న చిత్రంగా వచ్చి ఘన విజయం సాధించిన ‘ప్రేమద ఊరల్లీ’ని అభినందిస్తూ ఒక ట్వీట్ కూడా యష్ చేయకపోవడం మూవీ లవర్స్‌కు అసంతృప్తి కలిగిస్తోంది. టాక్సిక్ ఓటీటీ డీల్స్ కూడా తక్కువ ధరకు ఆఫర్ రావడంతో నిలిచిపోయాయని శాండల్‌వుడ్‌లో వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, యష్ ఈ విధంగా మీడియా ముందుకు రాకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.
అయితే, మరో 27 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ పార్ట్-1 పనుల్లో యష్ పార్ట్‌నర్‌గా ఉన్నాడు. రూ.4వేల కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవిలు ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నప్పటికీ, రావణుడి పాత్ర పోషిస్తున్న యష్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తన పాత్రకు సంబంధం లేకుండా ఈ చిత్రానికి యష్ కో-ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్న కారణంగా ఆయన ప్రమోషన్ల ముగింపు దశలోనైనా తప్పకుండా మీడియా ముందుకు రావాల్సి ఉంటుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.


