“ప్రభాస్ 21” కు ఈ గ్రాండ్ టెక్నిషియన్ ఫిక్సేనా.?

Published on Sep 18, 2020 7:03 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మాత్రం తన 21 వ చిత్రమే అని చెప్పాలి. నాగశ్విన్ తో చేస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే నాగశ్విన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ను లాక్ చేసారు.

అలాగే ఈ సినిమా కూడా మన దేశంలోనే అతి తక్కువగా టచ్ చేసిన స్కై ఫై జానర్ లో ఈ చిత్రాన్ని తీయనుండడంతో స్పెషల్ క్రేజ్ సంతరించుకుంది. అలా ఈ చిత్రానికి ఎంతో కీలకమైన మ్యూజిక్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. గత కొన్నాళ్ల కితం ఈ చిత్రానికి గ్రాండ్ మ్యూజిషిన్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తారని బజ్ వినిపించింది. ఇపుడు దాదాపు ఆయనే ఈ చిత్రానికి ఫిక్స్ అన్నట్టుగా మరోసారి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More