అట్లీ, షారుఖ్ భారీ ప్రాజెక్ట్ కి ఈమే ఫిక్స్ అట.?

Published on Jul 22, 2021 10:06 am IST

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ అట్లీ తన సినిమాలతో ఎంతటి ఫేమ్ తెచ్చుకున్నాడో తెలిసిందే. సౌత్ ఇండియన్ సినిమా దగ్గర తన సినిమాలతో మంచి బాక్సాఫీస్ లెక్కలనే సెట్ చేసిన అట్లీ అదే సమయంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఇక అక్కడ నుంచి ఈ చిత్రం పై భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరి ఈ ఊహించని కాంబో అయినటువంటి ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అన్న ఆసక్తి కూడా నెలకొంది. మరి ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్ సరసన సౌత్ సూపర్ స్టార్ హీరోయిన్ నయన్ ఫిక్స్ అయ్యినట్టుగా నయా టాక్. ఇది వరకే ఈమె పేరు రేస్ లోకి వచ్చినా ఇప్పుడు ఇదే ఫైనల్ అయ్యినట్టు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాని అట్లీ పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టు కూడా టాక్. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :