బిగ్ బాస్ 3 కంటిస్టెంట్స్ లిస్ట్…?

Published on Jul 21, 2019 1:54 pm IST

కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా ఇంకొద్ది గంటలలో “బిగ్ బాస్ 3” గ్రాండ్ గా మొదలు కాబోతుంది. ఈ షో ప్రారంభ వేడుకకు సంబంధిచిన ప్రోమో వీడియో చూస్తుంటే స్టార్ మా చాలా గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించబోతుందని అర్థం అవుతుంది. కింగ్ నాగార్జున వ్యాఖ్యగా ఎంపికైనప్పటినుండి ఈ షో కి మరింత క్రేజ్ వచ్చి చేరింది.

కాగా బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్న ఇంటి సభ్యులు వీరేనంటూ ఓ లిస్ట్ ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. ఈలిస్ట్ లో నటి హేమ,హీరో వరుణ్ సందేశ్ మరియు అతని భార్య వితిక,యాంకర్ శ్రీముఖి,సింగర్ రాహుల్, టీవీ 9 రిపోర్టర్ జాఫర్,వి6 రిపోర్టర్ సావిత్రి ఇలా మొత్తం 15మంది సెలబ్రిటీస్ కి చెందిన లిస్ట్ ఒకటి బయటికొచ్చింది. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. షో నిబంధనల ప్రకారం మొదటి ఎపిసోడ్ ప్రసారం ఐయ్యేవరకు బిగ్ బాస్ ఇంటి సభ్యులు తమ ఐడెంటిటీ రివీల్ చేయకూడదు. కాబట్టి ఇది ఊహాజనితమైన సభ్యుల లిస్ట్ మాత్రమే.

బిగ్ బాస్ 3లో పాల్గొంటున్న సభ్యుల లిస్ట్:
1.యాంకర్ శ్రీముఖి
2. వరుణ్ సందేశ్
3. వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు
4. టీవీ 9 జాఫర్
5. నటి పూర్ణిమ భూపాళం
6. నటి హేమ
7. వి6 యాంకర్ సావిత్రి
8. మూవీ ఆర్టిస్ట్ హిమజ
9. సీరియల్ ఆర్టిస్ట్ రోహిణి
10. డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్
11. సీరియల్ ఆర్టిస్ట్ రవి కృష్ణ
12. సీరియల్ ఆర్టిస్ట్ అలీ
13. ఫన్ బకెట్ మహేష్
14. సింగర్ రాహుల్ సిప్లిగూంజ్
15. అషు రెడ్డి (సమంత దబ్స్మాష్)

సంబంధిత సమాచారం :