తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ చిత్రంలో ఆమె రోల్ అదేనా…?

Published on Nov 10, 2019 10:35 pm IST

సందీప్ కిషన్ తాజా చిత్రం తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్. దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. కేసుల కోసం అవస్థలు పడే అనుభవం లేని కుర్ర లాయర్ గా సందీప్ నటిస్తుండగా హీరోయిన్ హన్సిక మోత్వానీ లేడీ లాయర్ పాత్ర చేయడం విశేషం. కాగా ఈ మూవీలో మరో లేడీ యాక్టర్ నటిస్తున్నారు. ఆమె ఎవరో కాదు తమిళంలో పవర్ ఫుల్ రోల్స్ చేశే వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె తమిళంలో విశాల్ నటించిన పందెంకోడి 2 చిత్రంలో విలన్ గా కూడా చేయడం జరిగింది. కాగా ఈమె పాత్రపై ఓ ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో నడుస్తుంది.

కేసులు లేక, కాసులు రాక అల్లాడుతున్న ఈ చెట్టుక్రింది లాయర్ కి వరలక్ష్మి సంబందించిన ఓ కేసు వాదించే అవకాశం వస్తుందట. ఎవ్వరూ టేక్ అప్ చేయని ఓ సీరియస్ కేసుని సందీప్ తీసుకుంటాడట. సినిమా మొత్తం ఆమె కేసు, అలాగే దానివలన సందీప్ కి ఎదురైన కష్టాలు, ఇబ్బందుల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని వినికిడి. అగ్రహారం నాగి రెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తుంగా ఈనెల 15న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More