చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కు ఈ పనులు జరిగిపోయాయా.?

Published on May 28, 2021 9:00 am IST

ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన పలు ఇంట్రెస్టింగ్ పాన్ ఇండియన్ సినిమాల్లో దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో ప్లాన్ చేసిన బెంచ్ మార్క్ చిత్రం కూడా ఒకటి. చరణ్ మరియు శంకర్ ల కెరీర్ లోనే కాకుండా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో కూడా ఇది ఒక బెంచ్ మార్క్ చిత్రం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని అంతా తీసుకున్నారు.

మరి ఈ సినిమా ఎప్పుడు మొదలు కానుంది అన్న అంశంపై సస్పెన్స్ ప్రస్తుతానికి నడుస్తుంది. కానీ ఈ గ్యాప్ లో మరో ఆసక్తికర బజ్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరిగిపోవడమే కాకుండా షూట్ కి కావాల్సిన లొకేషన్స్ వేట కూడా ఆల్రెడీ ఫిక్స్ అయ్యినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సమయంలో ప్రీ ప్రొడక్షన్ పనులు జరగడానికి ఆస్కారం ఉంది కానీ లొకేషన్స్ హంట్ పై నిజం లేకపోవచ్చని చెప్పాలి. శంకర్ ప్లానింగ్స్ అంటే ఏ లెవెల్లో ఉంటాయో తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో లొకేషన్స్ ఎలా ఫిక్స్ చేసారో అన్నది ప్రశ్నార్ధకమే.. మరి వేచి చూడాలి ఈ చిత్రం ఎప్పటి నుంచి మొదలు కానుందో..

సంబంధిత సమాచారం :