“టిల్లు స్క్వేర్” ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?

“టిల్లు స్క్వేర్” ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?

Published on Apr 17, 2024 11:11 AM IST


టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్” కోసం అందరికీ తెలిసిందే. మరి డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి సిద్ధూ ని 100 కోట్ల క్లబ్ లో నిలిపింది. అయితే ఇప్పటికీ బాగానే రన్ అవుతున్న ఈ సినిమా ఓటిటి రిలీజ్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ సినిమా ఈ ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి రానున్నట్టుగా టాక్. ఈ సినిమా హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక డేట్ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ చిత్రానికి భీమ్స్, అచ్చు అలాగే రామ్ మిర్యాల సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు. అలాగే నేహా శెట్టి, ప్రియాంక జవల్కర్ లు క్యామియో రోల్ లో కనిపించరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు