‘ఈషా’ బోల్డ్ వెబ్ సిరీస్ లేటెస్ట్ అప్ డేట్ !

Published on Jun 29, 2020 7:05 pm IST


టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిగా వచ్చి వరుస ఛాన్స్ లు అందుకంటూ తన అందం అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది ఈషా రెబ్బా. స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ మధ్య ఈషా రెబ్బా హాట్ స్టిల్స్ కూడా వదులుతుంది. అయితే ఈ తెలుగు బ్యూటీ ఓ లేటెస్ట్ అప్ డేట్ తో కూడా వార్తల్లో నిలిచింది. హిందీలో తెరకెక్కిన లస్ట్‌ స్టోరీస్ వెబ్‌సిరీస్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.

కాగా ఈ వెబ్‌సిరీస్‌ లో అత్యంత బోల్డ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది కియారా ఆడ్వాణీ. కాగా ఇప్పుడు ఆ బోల్డ్ పాత్రలో ఈషా రెబ్బా నటిస్తోంది. ప్రస్తుతం ఆ పాత్రకు ఆమె డబ్బింగ్ చెబుతుంది. దర్శకుడు వంగ సుందీప్ తెలుగులో చేస్తోన్న ఈ రీమేక్‌ ఎపిసోడ్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈషా ఈ వెబ్ సిరీస్ లో కియారాని ఎంతవరకు మరిపించిందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More