జులై 30 న థియేటర్ల లోకి ఇష్క్..!

Published on Jul 20, 2021 5:25 pm IST

ఎస్.ఎస్ రాజు దర్శకత్వం లో తేజ సజ్జ మరియు ప్రియా ప్రకాష్ వారిర్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం ఇష్క్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల కి సిద్దం అయింది. తాజాగా చిత్ర యూనిట్ విడుదల కి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. జూలై 30 వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్ల లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే తేజ సజ్జ మరియు ప్రియా ప్రకాష్ లు కలిసి ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇష్క్, ఇది ప్రేమ కథ కాదు అంటూ క్యాప్షన్ జత చేయడం జరిగింది.

ఎస్. ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి ప్రసాద్, పరాస్ జైన్, వకడ అంజన్ కుమార్ లు నిర్మిస్తున్నారు. శ్యామ్ కే. నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :