పూరి అనుకుంటే, అభిమానులు కూడా…!

Published on Jul 20, 2019 12:30 am IST

నిన్న రిలీజైన ఇస్మార్ట్ శంకర్ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని,రికార్డు వసూళ్ల వైపుగా దూసుకుపోతుంది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో 7.83 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించి రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవడం మూవీ సక్సెస్ కి దోహదం చేసింది.

పూరీని టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా చెప్పవచ్చు. ఇడియట్,పోకిరి వంటి చిత్రాలతో ఆయన ఓ కొత్త హీరోజం,మేనరిజం పరిచయం చేశాడు. హీరో పాత్రను విభిన్నంగా పరిచయం చేయడంలో పూరి తరువాతే ఎవరైనా. ఐతే పూరి అభిమానులుకూడా ఆయన లాగే కొత్తగా ఆలోచిస్తున్నట్లున్నారు. విషయం ఏమిటంటే వైజాగ్ లోని జగదాంబ ధియేటర్ దగ్గర అభిమానులు ఇస్మార్ట్ శంకర్ పోస్టర్ ని బీరుతో అభిషేకం చేసి వార్తలలో నిలిచారు. సాధారణంగా ఎవరైనా తమ అభిమాన నటుల,డైరెక్టర్ ల కట్ ఔట్స్ ని పాలాభిషేకమో, నీలాభిషేకమో చేస్తారో,కానీ వీరు బీరుతో అభిషేకం చేసి తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More