రికార్డు వసూళ్లు సాధించిన ‘ఇస్మార్ట్ శంకర్’

Published on Jul 19, 2019 8:44 am IST

“ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో పూరి జగన్నాధ్ మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడనిపిస్తుంది. సినిమా చూసిన ప్రతివారు పూరి ఈజ్ బ్యాక్ అంటున్నారు. నిన్న విడుదలైన “ఇస్మార్ట్ శంకర్” మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని,మంచి విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకాన్ని మేకర్స్ లో కలిగేలా చేసింది. హీరో రామ్ కి కూడా చాల కాలం తరువాత మంచి హిట్ దక్కింది అని అంటున్నారు. పూరి మార్క్ హీరోయిజం కి రామ్ ఎనర్జీ తోడవ్వడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాగా పేలింది.

ఇందుకు నిదర్శనమే ఈ మూవీ సాధించిన మొదటి రోజు వసూళ్లు. “ఇస్మార్ట్ శంకర్” ఏకంగా మొదటి రోజు 7.83 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక రెండవ స్థాయి హీరో సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడమనేది రికార్డు. దానికి తోడు ,రామ్,పూరి ల గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది మరీ ఎక్కువ అని చెప్పాలి. ఎలాగైతే నేమి, పూరి, రామ్ లు ఈసారి చెప్పి మరీ హిట్ కొట్టారు.

ఏరియాల వారీగా ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

ఏరియ కలెక్షన్స్
నైజాం 3.43 కోట్లు
సీడెడ్ 1.20 కోట్లు
వైజాగ్ 0.86 కోట్లు
ఈస్ట్ 0.50 కోట్లు
వెస్ట్ 0.40 కోట్లు
కృష్ణ 0.53 కోట్లు
గుంటూరు 0.57 కోట్లు
నెల్లూరు 0.30 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 7.83 కోట్లు

సంబంధిత సమాచారం :