‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు డేట్ ఫిక్స్ !

Published on May 26, 2019 10:26 am IST

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం జూలై 12వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతుంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ ను కూడా త్వరలో ముమ్మరంగా ప్లాన్ చేయాలని చూస్తోంది చిత్రబృందం.

ఇక ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నాబా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పూర్తిగా డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. కాగా ఈ చిత్ర విజయం పూరికి అలాగే రామ్ కెరీర్ కి కూడా కీలకం కానుంది. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More