ఇస్మార్ట్ శంకర్ స్టార్ట్ చేశాడు !

Published on Jan 24, 2019 11:13 am IST


పూరి జగన్నాధ్,రామ్ ల కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈచిత్రం యొక్క షూటింగ్ ఈరోజు హైద్రాబాద్లో ప్రారంభమైంది. ఈలాంగ్ షెడ్యూల్ లో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మే లో ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ చిత్రం లో రామ్ పాత్ర డిఫ్రెంట్ గా ఉండనుంది. పూరి , రామ్ ను ఈ చిత్రంలో కొత్తగా చూపించనున్నాడు అంతేకాకుండా రామ్ తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్ చెబుతాడట. యాక్షన్ ఎంటర్టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తుండగా పునీత్ ఇస్సార్ , సత్యదేవ్ , ఆశిష్ విద్యార్ధి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

గత కొంత కాలంగా వరస పరాజయాలతో సతమతమవుతున్న పూరి ఈచిత్రం తో ఎలాగైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తుండగా ఈచిత్రంతో కెరీర్ లో మొదటి బ్లాక్ బ్లాస్టర్ విజయం అందుకోవాలని రామ్ ఆశిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :

X
More