మేజర్ యాక్షన్ పార్ట్ ను పూర్తి చేసిన ఇస్మార్ట్ శంకర్ !

Published on May 5, 2019 2:29 pm IST

రామ్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనెర్ ఇస్మార్ట్ శంకర్ వారణాసి షెడ్యూల్ ఈరోజుతో పూర్తి అయ్యింది. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. ఇక ఈ చిత్రాన్ని మే లో విడుదల చేద్దామనుకున్నాడు పూరి కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల ఈ చిత్రాన్నీ జూలై లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

నిధి అగర్వాల్ , నాబా నటేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ పూర్తిగా డిఫ్రెంట్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్ర విజయం పూరి కి అలాగే రామ్ కెరీర్ కి కీలకం కానుంది. పూరి జగన్నాథ్ , ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More