నైజాంలో ‘ఇస్మార్ట్ శంకర్’కి భారీ ఓపెనింగ్స్ !

Published on Jul 18, 2019 6:23 pm IST

రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా పక్కా తెలంగాణ నేపథ్యంలో మాస్ మసాలా అంశాలతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ పై ముందు నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాల బాగుండటంతో పాటు సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో నైజాంలో మొదటి రోజే 2.5 నుండి 2.75 కోట్ల వరకు షేర్ ను సాధించొచ్చు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రేంజ్ కలెక్షన్స్ రామ్ కెరీర్ లోనే అద్భుతమైనవి.

ఇక నైజాంలో ఈ చిత్రం రైట్స్ 6.5 కోట్లకు అమ్ముడయ్యాయి. సినిమాకి వస్తోన్న బజ్ ని బట్టి ఈ వారంలోనే 6.5 కోట్లు పైగానే కలెక్షన్స్ రావొచ్చు. మొత్తానికి ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు నైజాం జనాన్ని కూడా బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పక్కా తెలంగాణ యాసలో కొత్తగా ఉన్న సంభాషణలు ఫుల్ ఎనర్జీతో సాగే రామ్ యాక్టింగ్ సినిమలో హైలెట్ గా నిలిచాయి.

సంబంధిత సమాచారం :