హీరో నితిన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అలియాస్ రుక్మిణి’. ఈ సినిమాను న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ మూవీపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రొమాంటిక్ డ్రామా మూవీ ఇప్పుడు ఒక కీలకమైన అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచింది.
ఈ సినిమా విడుదల తేదీని రేపు ఉదయం 10:08 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. దీనికి సంబంధించి విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే దానిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక స్పష్టత ఇవ్వలేదు.
ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి రేపు వెలువడనున్న రిలీజ్ డేట్ అప్‌డేట్ కోసం నితిన్ అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


