టాలీవుడ్ నిర్మాత నాగవంశీ సమర్పణలో వచ్చిన ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ‘బేబి’ హిట్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కలసి నటించిన ఈ రొమాంటిక్ కామిడీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం రేపటి(అక్టోబర్ 9) నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.
అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ‘ఎపిక్ క్లాసిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే కొత్త పేరుతో కనిపించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇది నెట్‌ఫ్లిక్స్ బృందం చేసిన పొరపాటా లేక చిత్రంలో ఏవైనా మార్పులు చేశారా అన్నది ఆసక్తికరంగా మారింది.
థియేటర్ వెర్షన్ కంటే ఓటీటీలో ఎక్స్‌ట్రా సీన్స్ ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. సాయి ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.


