మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రమే ‘కాకా’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కొల్లి బాబీ జెట్ స్పీడ్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతుండగా ఈ షూట్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. దీని ప్రకారం అప్పుడే ఈ సినిమా 70 శాతం పూర్తయిపోయినట్టు సమాచారం.
అలాగే ఈ అక్టోబర్ లేదా నవంబర్ కి మొత్తం షూటింగ్ పూర్తయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కొన్ని పాటలు, ఫైట్ సీక్వెన్స్ లు బాకీ ఉన్నాయట. సో సినిమా ఆన్ టైం రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో యువ నటి అనశ్వర రంజన్ కీలక పాత్రలో నటిస్తుండగా రీసెంట్ గానే ప్రముఖ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ యాడ్ అయ్యారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కే వి ఎన్ సంస్థ గ్రాండ్ గా ఈ సినిమాని తమ తొలి తెలుగు సినిమాగా ఎక్కడా తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ జనవరి 13న సినిమా విడుదల కాబోతుంది.


