నిర్మాత సురేష్ బాబు ఇంటిపై ఐటీ దాడులు.

Published on Nov 20, 2019 10:37 am IST

సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు నేడు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయన కార్యాలయలలో కూడా ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేశ్‌ ప్రొడక్షన్ కార్యాలయాల్లో తనిఖీలు జరుపుతున్నారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇటీవల కాలంలో చిన్న సినిమాలను పెద్ద ఎత్తున సురేశ్‌బాబు పంపిణీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ధియేటర్లను కూడా సొంతంగా ఆయన నడిపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్స్‌, దిల్‌ రాజు, కెఎల్‌ నారాయణ నివాసాలు, కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుస ఐటీ దాడులతో టాలీవుడ్‌ నిర్మాతలు కంగారుపడుతున్నారు.

కాగా ప్రస్తుతం సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న వెంకీ మామ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటుంది. వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈచిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కిస్తుండగా, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :