‘ఇట్లు అంజ‌లి` ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ !

‘ఇట్లు అంజ‌లి` ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ !

Published on May 7, 2019 2:49 PM IST

శ్రీకృష్ణ వొట్టూరు స‌మ‌ర్ప‌ణ‌లో ఓమా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై శ్రీ కార్తికేయ‌, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా న‌వీన్ మ‌న్నేల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `ఇట్లు అంజ‌లి`. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ హీరో శ్రీకాంత్, ద‌ర్శ‌కుడు మారుతి చేతుల మీదుగా సోమ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…“ ట్రైల‌ర్ , పాట‌లు చాలా బావున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన శ్రీ కార్తికేయ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతోన్న ఈ సినిమా, త‌న‌తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుక‌రావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు.

ద‌ర్శ‌క నిర్మాత న‌వీన్ మ‌న్నేల మాట్లాడుతూ…`ప్రేమ‌లేఖ ఆధారంగా సాగే ఇదొక డిఫ‌రెంట్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ చిత్రం. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన థ్రిల్ల‌ర్స్ క‌న్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా క‌ష్ట‌ప‌డి సినిమా చేసాం. మా క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతంః కార్తిక్ కొడ‌కండ్ల‌; సినిమాటోగ్ర‌ఫీః వి.కె.రామ‌రాజు; ఎడిటింగ్ః మార్తాండ కె వెంక‌టేష్‌; క‌థ‌-స్క్రీన్ ప్లే- డైలాగ్స-నిర్మాత – ద‌ర్శ‌క‌త్వంః న‌వీన్ మ‌న్నేల‌.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు