‘ఇట్లు’ షూటింగ్ మొదలైంది !

Published on May 25, 2019 5:11 am IST

అమీర్‌, శిరీష, అశ్విత హీరో హీరోయిన్లుగా రోశి రెడ్డి పందిళ్ళపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఇట్లు’. శ్రీజా ఆర్ట్స్‌ పతాకంపై రాజగౌడ్ పుదారీ, మెట్టయ్య వుప్పల‌, డా॥రఘు, డా॥శ్రీరాములు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభ‌మైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్ నివ్వగా, శ్రీమతి వాణి(ఎం ఎఫ్ టి ఐ) కెమెరా స్విచాన్‌ చేశారు. మద్దూరి వెంకట కృష్ణ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు.

అయితే ‘ఓ యువ రైతు తన గ్రామంలోని రైతులందరికి మంచి నాణ్యమైన విత్తనాలు అందిస్తూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని జీవితంలో సెటిల్‌ అవ్వాల‌నుకుంటాడు. ఇంతలో అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? హత్య కేసులో ఎందుకు ఇరుక్కున్నాడ‌నే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :

More