అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా !

జై లవకుశ సినిమా తరువాత ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా ఇటీవలప్రారంభం అయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను చినబాబు నిర్మిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.

ఈ సినిమా ఎలా ఉండబోతోదనే సందేహం చాలా మందిలో ఉంది. తాజా సమాచారం మేరకు ఇది ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ కామెడి, పంచ్ డైలాగ్స్ ఈ మూవీ లో ఉండబోతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలో సినిమా గురించి అన్ని వివారాలు మీడియాతో పంచుకోనున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ లుక్ మార్చుకోని డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు.