ఆఫీషియల్..”పుష్ప” రిలీజ్ స్ట్రామ్ కి ముహూర్తం ఖరారు!

Published on Aug 3, 2021 12:50 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియన్ లెవెల్లో ఐకాన్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేయనున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియన్ లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకుంది. బన్నీ మరియు సుకుమార్ ల కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం ఇది కావడం నిన్ననే ఫస్ట్ సింగిల్ పై కూడా సాలిడ్ అప్డేట్ ఇవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత స్థాయికి వెళ్తూ వస్తున్నాయి.

మరి ఇప్పుడు రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మరో భారీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రంపై ముందు నుంచి వినిపిస్తున్న రిలీజ్ సమయమే ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ నెలలో మొదటి పార్ట్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో పుష్ప రాజ్ స్ట్రామ్ ఫిక్స్ అయ్యినట్టే అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :