‘భీష్మ’ ట్రైలర్ కి టైమ్ వచ్చేసింది !

Published on Feb 16, 2020 1:50 pm IST

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఫిబ్రవరి 21న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. రేపు సాయంత్రం 4 గంటల 05 నిముషాలకు ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా రేపు ఘనంగా జరగనుంది. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా రానున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందట. కాగా ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం.

ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More