సుధీర్ బాబు లాంఛ్ చేసిన “జ” మూవీ ట్రైలర్… ఆకట్టుకుంటుంది గా!

Published on Jul 20, 2021 8:24 pm IST

టాలీవుడ్ సినీ హీరో సుధీర్ బాబు జ చిత్రం ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. ప్రతాప్ రాజు, హిమజా ప్రధాన పాత్రల్లో సైది రెడ్డి చిట్టెపు దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం జ. హార్రర్ నేపథ్యం లో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. జై దుర్గ ఆర్ట్స్ పతాకంపై కందుకూరి గోవర్ధన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర లు సైతం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే విడుదల అయిన కొద్ది సేపటికే ట్రైలర్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. అయితే ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ సుధీర్ బాబు చెప్పుకొచ్చారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :