సమీక్ష్ : జాట్ – మాస్ ప్రేక్షకులకు మాత్రమే

సమీక్ష్ : జాట్ – మాస్ ప్రేక్షకులకు మాత్రమే

Published on Apr 11, 2025 3:01 AM IST

Jaat Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సన్నీ డియోల్, రణ్‌దీప్ హుడా, రెజీనా కాసాండ్ర, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, జగపతి బాబు, రమ్యకృష్ణ, తదితరులు
దర్శకుడు : గోపీచంద్ మలినేని
నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవి శంకర్, టి.జి.విశ్వప్రసాద్, ఉమేష్ కుమార్ బన్సల్
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ
ఎడిటర్ : నవీన్ నూలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రణ్‌దీప్ హుడా విలన్‌గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జాట్’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :
శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన కూలీ రణతుంగ(రణ్‌దీప్ హుడా), అతని తమ్ముళ్లతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మోటుపల్లిలో పవర్‌ఫుల్ రౌడీగా ఎదుగుతాడు. అతడు, తన తమ్ముళ్లు చేసే అకృత్యాలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అనుకోని విధంగా ఈ గ్రామంలోకి వచ్చిన బల్బీర్ ప్రతాప్ సింగ్(సన్నీ డియోల్) వారిని ఎదిరిస్తాడు. ఇంతకీ వారితో ప్రతాప్ సింగ్‌కు గొడువ ఎందుకు వచ్చింది..? వారిని ఎదురించే క్రమంలో అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి..? రణతుంగ నుంచి ప్రతాప్ సింగ్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తాడు..? ఇంతకీ రణతుంగా, ప్రతాప్ సింగ్‌ల ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్‌లో తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా సన్నీ డియోల్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథ రొటీన్ అయినప్పటికీ, తనకు ఎంతగానో కలిసొచ్చిన మూవీ టేకింగ్‌తో గోపీచంద్ మలినేని ఆకట్టుకుంటాడు. ఇక కథలోని ఫస్టాఫ్ ప్రేక్షకులకు మాస్ ఫీస్ట్‌గా పలు యాక్షన్ సీక్వెన్స్‌లతో తీర్చి దిద్దుతాడు.

సన్నీ డియోల్‌ను మరోసారి పర్ఫెక్ట్ మాస్ హీరోగా ప్రెజెంట్ చేసిన తీరు చాలా బాగుంది. అతని పంచ్ పవర్‌తో యాక్షన్ సీక్వెన్స్‌లను ఎలివేట్ చేసిన విధానం మాస్ ఆడియెన్స్‌కు నచ్చుతుంది. ఫస్టా్ఫ్‌లో స్క్రీన్ ప్లే ఏమాత్రం ల్యాగ్ లేకుండా వెళ్లడంతో సినిమాలోని సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అవుతుంది. అటు విలన్ పాత్రలో రణ్‌దీప్ హుడా కూడా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. విలనిజాన్ని తనదైన శైలిలో పండించాడు.

హీరో విలన్‌ను ఢీకొనే సీన్స్‌ను చక్కగా ప్రెజెంట్ చేశారు. ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీక్వెన్స్‌లు కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. ఈ సినిమాను హీరో, విలన్ తమ భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లారని చెప్పాలి. థమన్ మరోసారి తన బీజీఎంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.

మైనస్ పాయింట్స్ :
మాస్ సినిమా అయినప్పటికీ ఇందులో ఓ చక్కటి కథ ఉండి ఉంటే దీని రిజల్ట్ వేరేలా ఉండేది. గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ రొటీన్ అయినా, దానికి కావాల్సిన ఎమోషన్స్ పండించలేకపోయాడు. కేవలం యాక్షన్ పైనే ఆయన ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. కామన్ ఆడియెన్స్‌కు ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు పెద్దగా నచ్చకపోవచ్చు.

ఓ చిన్న కారణంతో కథను ముందుకు తీసుకెళ్లడం కొంతమేర మెప్పించలేదు. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ స్లోగా సాగుతాయి. ఇక ఈ సినిమాలో మెజారిటీగా తెలుగు స్టార్స్ ఉండటంతో వారి హిందీ డైలాగ్ డెలివరీ కూడా ఆకట్టుకోదు. ముఖ్యంగా అజయ్ ఘోష్ హిందీ డైలాగ్స్ వేరొకరితో చెప్పించి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

థమన్ బీజీఎం బాగున్నా దాని లౌడ్‌నెస్ కారణంగా ప్రేక్షకులకు చిరాకు కలుగుతుంది. చాలా సీన్స్ మనకు ఇదివరకే వేరే సినిమాల్లో చూసినట్లు గా అనిపిస్తాయి. విలన్ పాత్రను ఇంకా పవర్‌ఫుల్‌గా చూపించాల్సింది. రెజీనా పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు గోపీచంద్ మలినేని ఎంచుకున్న కథ రొటీన్. అయినా, దాన్ని తనదైన టేకింగ్‌తో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. ఇక ఆయన హీరోను ఎలివేట్ చేసే సీన్స్ చక్కగా ప్రెజెంట్ చేశారు. స్రీన్‌ప్లే విషయంలోనూ ఆయన మరికాస్త ఫోకస్ పెట్టాల్సింది. ఇక థమన్ ఎప్పటిలాగే తన బీజీఎంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, లౌడ్‌నెస్ ఎక్కువగా ఉండటం మైనస్. సినిమాటోగ్రఫీ వర్క్ ఫర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపిస్తాయి. నిర్మాణ విలువలు గ్రాండ్‌గా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌ల భారీతనంలో మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది.

తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. ‘జాట్’ సినిమాతో దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం కొంతవరకు వర్కౌట్ అయ్యింది. హీరో నుంచి వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. రణ్‌దీప్ హుడా కూడా తన విలనిజంతో మెప్పిస్తాడు. కానీ, ఔట్‌డేటెడ్ కథ, సెకండాఫ్‌లోని ల్యాగ్ సీన్స్, సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోక పోవడం వంటి అంశాలు మైనస్. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను ఓసారి ట్రై చేయవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు