“జాతి రత్నాలు” వసూళ్ల వర్షం..మొత్తం వీకెండ్ వసూళ్లు ఇవే.!

Published on Mar 15, 2021 5:12 pm IST

గత వారం మహా శివ రాత్రి కానుకగా విడుదల కాబడిన మిడ్ రేంజ్ చిత్రాల్లో నవీన్ పోలిశెట్టి హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణలు మరో కీలక పాత్రల్లో నటించిన “జాతి రత్నాలు” కూడా ఒకటి. అనుదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

మరి ఈ చిత్రం మాత్రం విడుదల కాబడిన మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ రాబట్టి ప్రతీరోజు ఊహించని విధంగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇలా ఫైనల్ గా మొదటి వారాంతానికి సెన్సేషనల్ 20 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసినట్టు తెలుస్తుంది.

ఇది మాత్రం ఒక అద్భుతమైన ఫీట్ అని చెప్పాలి. ఇప్పటికే 180 పర్సెంట్ ప్రాఫిట్స్ జోన్ లోకి ఎంటర్ అయ్యిపోయిన ఈ చిత్రం ఫైనల్ రన్ లో కూడా మంచి మార్క్ నే సెట్ చెయ్యడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇప్పటికే అనేక ప్రముఖుల నుంచి నవీన్ కు ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :