కన్నడ స్టార్ హీరో సినిమాలో జగపతిబాబు !

Published on May 10, 2019 6:09 pm IST

‘లెజెండ్’ సినిమాతో ప్రతినాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు తెలుగు పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగునాట పెద్ద సినిమాలతో బిజీగా ఉన్న ఆయన తాజాగా ‘రాబర్ట్’ అనే కన్నడ చిత్రానికి సైన్ చేశారు.

ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో దర్శన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. తరుణ్ సుధీర్ దర్శకుడు. ఇందులో కూడా జగపతి ప్రతినాయకుడి పాత్రలోనే కనిపిస్తారట. ఆయన పాత్రకు మంచి ఎలివేషన్ ఉంటుందని టాక్. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఇకపోతే గతంలో జగపతిబాబు యువ హీరో నిఖిల్ చేసిన ‘జాగ్వార్’ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

సంబంధిత సమాచారం :

More