కన్నడ స్టార్ హీరోకి తెలుగు హీరో విలన్ !

Published on May 8, 2019 11:49 pm IST

ఫ్యామిలీ హీరో జగపతి బాబు హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తర్వాత వరుస సినిమాలతో ప్రస్తుతం దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోనే ప్రధాన పాత్రలతో విలన్ పాత్రలతో అలరిస్తున్నారు. ఇప్పటికే తమిళ్ మలయాళ సినిమాల్లో ఎక్కువుగా కనిపిస్తోన్న జగపతి బాబు, ఇప్పుడు కన్నడ సినిమాల పై కూడా దృష్టి పెట్టాడు.

అయితే గతంలోనే బచ్చన్‌, జాగ్వర్‌ లాంటి కొన్ని కన్నడ చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ మధ్య కన్నడ పరిశ్రమ పై ఎక్కువ ఫోకస్ పెట్టారట. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం జగపతిబాబు, కన్నడ స్టార్ హీరో దర్శన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘రాబర్ట్’ సినిమాలో విలన్‌ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం మంగళవారం లాంచనంగా ప్రారంభమైంది. మొత్తానికి జగపతి బాబు ఇతర భాషల్లో కూడా బాగా బిజీ అవుతున్నాడు.

సంబంధిత సమాచారం :

More