నయనతార పై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ….. !

Published on Aug 5, 2022 11:52 pm IST

జాన్వీ కపూర్ హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ గుడ్ లక్ జెర్రీ. నాలుగేళ్ళ క్రితం నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోకో కోకిల మూవీ కి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన గుడ్ లక్ జెర్రీ జులై 29న ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. అయితే ఈ మూవీ సక్సెస్ గురించి ఇటీవల మీడియాతో జాన్వీ కపూర్ మాట్లాడుతూ, మూవీ కోసం తనతో సహా టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డాం అని, ఫైనల్ గా మూవీకి మంచి ఆదరణ లభిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

అలానే జాన్వీ మాట్లాడుతూ, ఈ మూవీ పై లేడీ సూపర్ స్టార్ నయనతార పాజిటివ్ గా స్పందించారనే వార్త ఇటీవల తాను విన్నానన్నారు. అనంతరం ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి ఆమెకు సంతోషం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశాను, దానికి ఆమె రిప్లై ఇస్తూ, కెరీర్ బిగినింగ్ లోనే ఇటువంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఎంచుకున్నందుకు గర్విస్తున్నా, నీకు అభినందనలు అంటూ ఆమె పెట్టిన మెసేజ్ ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని, అంతటి పేరున్న నటి నాకు ఈ విధంగా అభినందనలు తెలపడం అమితానందాన్నిచ్చిందని అన్నారు జాన్వీ.

సంబంధిత సమాచారం :