“జై బాలయ్య” వీడియో సాంగ్ విడుదల కి ముహూర్తం ఫిక్స్!

Published on Jan 9, 2022 11:22 pm IST


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖండ. వీరిద్దరి హ్యాట్రిక్ చిత్రం గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఇంకా పలు చోట్ల కనక వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం లోని పాటలకు అదే రేంజ్ లో హైప్ రావడం విశేషం. ఈ చిత్రం లో జై బాలయ్య వీడియో సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం లోని జై బాలయ్య వీడియో సాంగ్ ను రేపు సాయంత్రం 7 గంటలకు విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రముఖ దర్శకుడు థమన్ సంగీతం అందించిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించడం జరిగింది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ నిర్మించడం జరిగింది.

సంబంధిత సమాచారం :