జై సింహ సెన్సార్ టాక్ !


భారి అంచనాల మద్య సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది జై సింహ. సి. కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాను కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 8న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీగా ప్లాన్ చేసారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది.

సెన్సార్ టాక్ ఏంటంటే… సినిమాలో నాలుగు భారి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంట. బాలయ్య మరియు నయనతార మద్య వచ్చే సెంటిమెంట్ బాగుందంట. బాలయ్య &హరిప్రియ మద్య సన్నివేశాలు, జాని మాస్టర్ కంపోజ్ చేసిన అమ్మకుట్టి సాంగ్ బాగా వచ్చిందంట. కె.ఎస్.రవికుమార్ స్క్ట్రీన్ ప్లే, రత్నం కథ మాటలు సినిమాకు బాగా కుదిరాయని సమాచారం. క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం కానుందని సెన్సార్ టాక్.