కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ జైలర్. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, నాగబాబు తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న జైలర్ మూవీ ఆగష్టు 1న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.
ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా నేడు షోకేస్ పేరుతో జైలర్ తెలుగు థియేట్రికల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం అక్కినేని నాగ చైతన్య రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ లో రజినీకాంత్ పవర్ఫుల్ స్టైల్, లుక్స్, డైలాగ్స్, ఆకట్టుకునే విజువల్స్ తో పాటు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగున్నాయి. ఇక మొత్తంగా అయితే జైలర్ ట్రైలర్ మాస్ యాక్షన్ హంగులతో అదిరిపోవడంతో పాటు మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసింది. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన జైలర్ రిలీజ్ అనంతరం ఎంతమేర సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే మరొక వారం రోజుల వరకు ఆగాల్సిందే.
