‘జంబలకిడిపంబ’ విడుదల తేదీ ఖరారు!
Published on May 16, 2018 6:37 pm IST

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ లో ఒకరిగా కొనసాగుతూనే సోలో హీరోగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు శ్రీనివాస్ రెడ్డి. ఈయన హీరో గా గతంలో వచ్చినా ‘గీతాంజలి ,జయమ్ము నిచ్ఛయమ్మురా’ చిత్రాలు మంచి విజయాన్నిసాధించాయి.శ్రీనివాస్ రెడ్డి నటిస్తున్న తాజా చిత్రం’జంబలకిడిపంబ’.

శివం సెల్యూలాయిడ్స్‌,మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శ్రీనివాస్ రెడ్డి సరసన సిద్ధి ఇద్నాని కథానాయకిగా నటిస్తున్నారు.జె.బి.ముర‌ళీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇటీవల రిలీజ్ అయినా ఈ చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈచిత్రాన్నిజూన్ 14న విడుదల చేయన్నునారు.

 
Like us on Facebook