నైజాం ఏరియాలో దిల్ రాజు సేఫ్

janatha-garage-2

భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబడుతోంది. అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పూర్తయ్యేవరకూ సినిమాపై క్రేజ్ పెరుగుతూ వచ్చిందే కాని తగ్గలేదు. అందుకే అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూషన్ హక్కులు పెద్ద మొత్తానికే అమ్ముడయ్యాయి. ముఖ్యంగా నైజాం రైట్స్ రూ. 15 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. అంత భారీ మొత్తం పెట్టి కొన్నది ఎవరో కాదు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత దిల్ రాజు.

ఆయన పెట్టిన మొత్తం ఈ మొదటి వారంలోనే వసూలయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే మొదటిరోజు ఈ చిత్రం నైజాంలో రూ. 5.51 కోట్లు రాబట్టగా, రెండవరోజు రూ.2. 19 కోట్లు, మూడవరోజు రూ. 1. 85కోట్లు వసూలు చేసి మొత్తం మూడురోజులకు గాను రూ 9.55 కోట్లకు చేరువైంది. ఇక ఈరోజు, రేపు రెండు రోజులు సెలవులు కావడం, పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో మొదటి వారంలోనే ఈ లెక్క రూ. 15 కోట్లు దాటిపోతుందని, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ లాభాలనే లెక్కపెడతాడని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.