శ్రీ దేవి కూతురు అనిపించుకుంది !

Published on Jul 23, 2018 12:18 pm IST

అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నటించిన మొదటి చిత్రం ‘ధఢక్’. శ్రీదేవి కి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆమె కూతరు హీరోయిన్ గా నటిస్తుందంటే ఆచిత్రం ఫై భారీ అంచనాలు ఉండడం సహజమే. పైగా ఈచిత్రం మరాఠి భాషలో విజయం సాధించిన సైరాత్ కు రీమేక్ కావడంతో ఈ అంచనాలు మరితంగా పెరిగాయి. ఇక జాన్వీ కూడా అంచనాలను అందుకుందనే చెప్పాలి. ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో రూ. 33. 61 కోట్ల వసూళ్లను రాబట్టి మంచి విజయం దిశగా దూసుకుపోతుంది.

రెండు వేర్వేరు కులాలకు చెందిన అమ్మాయి , అబ్బాయికి మధ్య జరిగే ప్రేమ కథ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇషాంత్ కట్ఠర్ హీరోగా నటించాడు. ప్రముఖ నిర్మాతలు కరణ్ జోహార్ , అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అశుతోష్ రానా ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఇక సైరాత్ చిత్రాన్ని ఇంతకుముందు పంజాబీ భాషలో కూడా రీమేక్ చేశారు. ఈచిత్రంలో ఇటీవల ‘ఆర్ఎక్స్ 100’ తో సెన్సేషన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :