డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “జపాన్”

డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న “జపాన్”

Published on Dec 4, 2023 1:30 PM IST

కోలీవుడ్ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ జపాన్. ఈ మూవీ రీసెంట్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యింది. బాక్సాఫీస్ వద్ద అంతగా వసూళ్లను రాబట్టలేదు. ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయింది.

డిసెంబర్ 11, 2023 నుండి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫారం అయిన నెట్ ఫ్లిక్స్ లో జపాన్ మూవీ ప్రసారం కానుంది. అను ఇమ్మాన్యుయేల్ లేడీ లీడ్ రోల్ లో నదించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మించడం జరిగింది. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు