గేమ్ చేంజర్: జరగండి సాంగ్ కి టైమ్ ఫిక్స్!

గేమ్ చేంజర్: జరగండి సాంగ్ కి టైమ్ ఫిక్స్!

Published on Mar 26, 2024 11:30 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ (Game changer). ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రేపు గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను ఫ్యాన్స్ కి అందించారు.

రేపు ఉదయం 9:00 గంటలకి జరగండి సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఒక అద్భుతమైన, సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ లో రామ్ చరణ్ లుక్ అభిమానులకు ట్రీట్ అని చెప్పాలి. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్.జే. సూర్య, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు