‘జవాన్’ కృష్ణా జిల్లా లేటెస్ట్ కలెక్షన్స్ !
Published on Dec 6, 2017 10:39 am IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ గత వారం విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఓపెనింగ్స్ తేజ్ కెరీర్లోనే ఉత్తమమైన ఓపెనింగ్స్ గా నిలిచాయి. మొదటి రోజే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా చిత్ర టీమ్ ప్రమోషన్ల వలన శని, ఆదివారాల్లో వసూళ్లు స్టడీగానే కొనసాగాయి.

దీంతో ముఖ్యమైన కృష్ణా జిల్లా రీజియన్లో మొదటి మూడురోజులకు కలిపి రూ.47.97 లక్షల షేర్ ను ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి 5 వరోజు రూ.1.6 లక్షలను రాబట్టి మొత్తంగా 5 రోజులకు కలిపి రూ .52.18 లక్షల షేర్ ను నమోదు చేసింది. బివిఎస్.రవి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందివ్వగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook