ప్రమోషన్ల వేగం పెంచిన ‘జవాన్’ టీమ్
Published on Dec 4, 2017 3:30 pm IST

సాయి ధరమ్ తేజ్ నటించిన ‘జవాన్’ చిత్రం గత శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అందుకే చిత్ర యూనిట్ సినిమాను ఇంకాస్త మెరుగ్గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్ల వేగం పెంచింది. పరిశ్రమలోని సీనియర్ నటుల కోసం ప్రత్యేకంగా షో వేశారు ‘జవాన్’ టీమ్.

ఈ స్పెషల్ షోకు సీనియర్ నటుడు సుధాకర్ తో పాటు ఇంకా పలువురు సీనియర్ నటీనటులు హాజరై సినిమా చాలా బాగుందని, మంచి మెసేజ్ ఉన్న చిత్రమని, ఇలా తమని ప్రత్యేకంగా పిలిచి సినిమా చూపినందుకు సంతోషమని అన్నారు. టాక్ మిశ్రమంగానే ఉన్నా ఓపెనింగ్స్ మాత్రం తేజ్ కెరీర్లోనే ఉత్తమమైనవిగా నిలిచాయి. బివిఎస్. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది.

 
Like us on Facebook