ఆడమ్, ఈవ్ ఫోజ్ లో జయం రవి,కాజల్

Published on May 24, 2019 11:00 pm IST

జయం రవి , కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న మూవీ “కోమలి”. ఓ వైవిధ్యమైన కథాంశంతో డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ఈ మూవీని చిత్రీక రిస్తున్నారు. పేషెంట్ గా, ఆదిమానవుడిగా, బ్రిటీషర్స్ ఖైదీగా దాదాపు ఆరు డిఫరెంట్ లుక్స్లో ఉన్న జయం రవి పోస్టర్స్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ నేడు, కాజల్ తో ఉన్న మరో ఆసక్తి కరమైన పోస్టర్ ని విడుదల చేసారు.

వనం మధ్యలో నగ్నంగా జయం రవి, కాజల్ ఉన్న ఆ పోస్టర్ ఆడమ్, ఈవ్ లను గుర్తు చేసేదిగా ఉంది. ఇన్ని భిన్నమైన పోస్టర్స్ విడుదల కావడంతో అసలు ఈ మూవీ స్టోరీ ఏమైఉంటుందని ప్రేక్షకులలో ఆసక్తి రేగుతుంది. వేల్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజ్ స్వరాలు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More