కాజల్ సినిమా కోసం 20కేజీల బరువుతగ్గిన హీరో…!

Published on Aug 10, 2019 9:23 pm IST

హీరో జయం రవి, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కోమలి. దర్శకుడు ప్రదీప్ రంగనాధన్ ఓ విభిన్న కధాంశంతో తెరకెక్కించారు. వేల్స్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్స్ పతాకంపై తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానుంది. ఈ మూవీలో హీరో రవిని దర్శకుడు ఆదిమానవుడిగా, పేషేంట్ గా, స్కూల్ బాయ్ గా, ఆడం గా, సెక్యూరిటీ గార్డ్ గా, విభిన్న అవతారాలలో చూపించనున్నారు.

ఐతే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హీరో జయం రవి ఈ మూవీ కొరకు ఏకంగా 20కేజీల బరువుతగ్గాడని సమాచారం. కోమలి చిత్రంలో స్కూల్ బాయ్ గా కూడా కనిపించనున్న రవి ఆ లుక్ రావడం కోసం కస్టపడి అంత బరువు తగ్గాడట. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.

సంబంధిత సమాచారం :