‘మా’ వివాదం పై జీవితా రాజశేఖర్‌ వివరణ !

Published on Oct 22, 2019 1:34 am IST

మొత్తానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మళ్లీ గందరగోళం జరిగిన సంఘటన సంగతి తెలిసిందే. ఈ మధ్య ఎప్పుడు ఏదొక సమస్యతో ‘మా’ వార్తలెక్కడం ఆనవాయితీగా మారిపోతుంది. అయితే తాజాగా ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవితా రాజశేఖర్‌ స్పందించారు. ఈ సమావేశం నిర్వహించడానికి ‘మా’ కార్యవర్గం ఆమోదం మేరకు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మా’ సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

ఈ సమావేశంలో పలు విషయాల పై చర్చించాము. అయితే కొంతమంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే వాటిని పరిష్కరించలేకపోయాము. అయితే ఎక్కువమంది సభ్యులు అత్యవసరంగా ‘ఎక్స్‌ట్రార్డినరీ జనరల్ బాడీ మీటింగ్’ పెట్టాలని కోరారు. 20 శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపిన 21 రోజుల్లోపు తప్పకుండా మీటింగ్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలా మీటింగ్‌ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. మీటింగ్‌ జరగాలని కోరుకునేవారు ‘మా’ కార్యాలయానికి వచ్చి సంతకాలతో ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని జీవితా రాజశేఖర్‌ పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం :

X
More