జెర్సీ ,కాంచన 3 లేటెస్ట్ గుంటూరు కలెక్షన్స్ !

Published on Apr 28, 2019 10:42 am IST

నాని జెర్సీ , లారెన్స్ కాంచన 3 ఈనెల 19న విడుదలై మొదటి వారం మంచి వసూళ్లను కలెక్ట్ చేసిన ఈ రెండవ వారం మాత్రం బాక్సాఫీస్ వద్ద నెమ్మదించాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. దాంతో అనుకున్న రేంజ్ లో కల్లెక్షన్స్ ను రాబట్టలేకపోతున్నాయి.

కలెక్షన్ల విషయానికి వస్తే జెర్సీ గుంటూరు జిల్లాలో 9రోజుల్లో 1,29,47,952 షేర్ ను రాబట్టగా కాంచన 3 9రోజుల్లో అక్కడ 1,12,67,059 షేర్ ను రాబట్టింది. ఇక కాంచన 3 ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కాగా మరి మహర్షి సినిమా విడుదలకు ఇంకా 12రోజుల సమయం ఉన్నందున ఈలోగా జెర్సీ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :