శరవేగంగా పూర్తి కానున్న పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమా.!

Published on Jan 20, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు శ్రీరామ్ వేణుతో “వకీల్ సాబ్” సినిమా సోషల్ సబ్జెక్టుతో సాలిడ్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఇటీవలే వచ్చిన టీజర్ కు గాను సాలిడ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఈ సినిమా ఇంకా లైన్ లో ఉండగానే ఎప్పుడు లేని విధంగా ఏక కాలంలో ఎన్నో సినిమాలను లైన్ లో పెట్టేసి పవన్ ఆశ్చర్యపరిచారు.

మరి అలా టేక్ చేసిన అన్ని సినిమాల్లో కూడా విలక్షణ దర్శకుడు క్రిష్ తో ప్లాన్ చేసిన ఒక ప్రిస్టేజియస్ పీరియాడిక్ డ్రామా కూడా ఒకటి. దీని కోసం మాత్రం పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికే కొంత మేర షూట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రం షూట్ లో మళ్ళీ పవన్ పాల్గొంటున్నారు. మరి లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ సినిమా షూట్ షూట్ చాలా వేగంగా ఫినిష్ చేసేయాలని అనుకుంటున్నారట.

అంతే కాకుండా డెఫినెట్ గా ఏడాది లోనే విడుదల చెయ్యడం ఖాయం అన్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి క్రిష్ బెస్ట్ క్వాలిటీతో ఎంత త్వరగా అలాంటి సినిమాలు పూర్తి చేసేస్తారో తెలిసిందే. మరి ఈ సినిమాను ఎప్పటికి విడుదల చేస్తారో చూడాలి. ఇక సాలిడ్ చిత్రానికి ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :