ఫిష్ వెంకట్‌కు రూ.2 లక్షల వైద్య సహాయం అందజేసిన ‘జెట్టి’ సినిమా హీరో కృష్ణ మానినేని

ఫిష్ వెంకట్‌కు రూ.2 లక్షల వైద్య సహాయం అందజేసిన ‘జెట్టి’ సినిమా హీరో కృష్ణ మానినేని

Published on Jul 10, 2025 7:08 AM IST

jeeti

‘జెట్టి’ సినిమా హీరో కృష్ణ మానినేని ఆధ్వర్యంలో వారు స్థాపించిన సేవా సంస్థ 100Dreams Foundation ద్వారా సినీ నటుడు ఫిష్ వెంకట్ వైద్య అవసరాల కోసం వారి కూతురు స్రవంతికి PRK హాస్పిటల్స్‌లో రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు.

చిత్రపరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయన వైద్య ఖర్చులకు మద్దతుగా ఈ ఆర్థిక సహాయం అందించడం హీరో కృష్ణ యొక్క మానవతా విలువలను ప్రతిబింబిస్తోంది.

ఈ సందర్భంగా కృష్ణ మానినేని మాట్లాడుతూ.. ‘100Dreams Foundationలో ఒక కార్యక్రమం అయిన పునరపి (అవయవ దానం అవగాహన కార్యక్రమం) మా ఆశయం మాత్రమే కాదు, అవసరంలో ఉన్నవారికి జీవితం ఇవ్వాలన్న సంకల్పం. అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క నిర్ణయం – ఒక జీవితం‘ అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు