
రాఘవ లారెన్స్, ఎస్.జే. సూర్య ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ జగర్ తండ డబుల్ ఎక్స్. ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ను నవంబర్ 10, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం ను తెలుగు లో కూడా బాగానే ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రం కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 4, 2023 న ప్రధాన్ కన్వెన్షన్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ లో సాయంత్రం 6:00 గంటల నుండి నిర్వహించనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుక కి టాలీవుడ్ స్టార్ హీరో, విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు. సంతోష నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.