అదే జరిగితే థియేటర్లు మూతపడటం ఖాయం.

Published on Aug 13, 2019 10:10 am IST

దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత మరో కొత్త విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టనున్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే అదే అనుమానం కలుగుతుంది. ఇటీవల జరిగిన ఆర్ ఐ ఎల్ 42వ జనరల్ బాడీ మీటింగ్ లో ఆయన ఓ సరికొత్త ఆఫర్ ని తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న జియో ఫైబర్ కస్టమర్లు ఇకపై కొత్త చిత్రాలను విడుదల రోజునే తన ఇంటిలో కూర్చుని వీక్షించే వెసులుబాటును కలుగజేయబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఫస్ట్ డే ఫస్ట్ షో పేరుతో అందుబాటులోకి రానున్న ఈ కొత్త విధానంతో నచ్చిన హీరో చిత్రాన్ని ప్రశాంతమైన వాతావరణంలో, ఎటువంటి డిస్టబెన్స్ లేకుండా వీక్షించే అవకాశం కలుగుతుంది. క్రేజీ హీరో మూవీ టికెట్స్ దొరుకుతాయో లేదో అనే సమస్య ఉండదు.

ఐతే ఈ విధానం సినిమా దియేటర్లకు శరాఘాతం కానుంది. ఇప్పటికే పైరసీ బూతంతో థియేటర్స్ వెలవెల బోతున్న తరుణంలో,నెట్ ఫ్లిక్, అమెజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాల రాకతో ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించడం చాలా కష్టతరంగా మారింది. ఒకతరగతి వర్గానికి చెందిన ప్రజలు థియేటర్లకు రావడం మానేశారు. ఇప్పుడు జియో కొత్త విధానంతో ఇక దేశవ్యాప్తంగా ఉన్న వేల ధియేటర్ల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. థియేటర్ల యాజమాన్యాల దగ్గరనుండి, డిస్ట్రిబ్యూటింగ్ వ్యవస్థలు చిన్నా భిన్నం అవుతాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా పరిశ్రమపై ఆధారపడిన అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు.

దీనితో ఐమ్యాక్, ఐనాక్స్, పీవీఆర్ సినిమాస్ వంటి దేశీయ ధియేటర్ యాజమాన్య సంస్థలు ఆందోళన మొదలుపెట్టాయి. థియేటర్ల మనుగడను దెబ్బతీసే ఇలాంటి విధాలకు అనుమతులు ఇవ్వరాదంటూ నిరసన గళం విప్పాయి. మరి అక్కడున్నది ఎవరినైనా శాశించగల ప్రపంచ కుబేరులలో ఒకరైన ముఖేష్ అంబానీ. మరి వీరి పోరాటం ఎంత వరకు విజయం సాధిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :