‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక’ కృష్ణ జిల్లా వసూళ్లు !


గత శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ‘నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక’ లు బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతున్నాయి. వసూళ్లకు కీలకమైన కృష్ణా జిల్లా విషయానికొస్తే అక్కడ బోయపాటి సినిమా మాస్ ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది. నిన్న 7వ రోజు 4.35 లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా 85.78 లక్షలు కలెక్ట్ చేసింది.

ఇక రానా – తేజాల ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం అయితే అన్ని సినిమాలకన్నా మెరుగైన వసూళ్లను సాధిస్తోంది. నిన్న 7వ రోజు 4.5 లక్షలు వసూలు చేసిన ఈ సినిమా మొత్తంగా 1.14 రూపాయల్ని కొల్లగొట్టింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా చూస్తే జయ జానకి నాయక దాదాపు రూ. 15 కోట్ల రూపాయల్ని నేనే రాజు నేనే మంత్రి 19 కోట్ల రూపాయల్ని వసూలు చేసింది.