‘జై లవ కుశ’ కృష్ణా, గుంటూరు వసూళ్ల వివరాలు !


ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ అనుకున్నట్టుగానే తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్సును రాబట్టింది. చాలా ఏరియాల్లో మొదటిరోజు రికార్డ్ కలెక్షన్లను నమోదుచేసింది. నైజాంలో రూ.5.05 కోట్ల షేర్ ను రాబట్టిన ఈ సినిమా గుంటూరులో అత్యదికంగా రూ.3.05 కోట్ల షేర్ ను ఖాతాలో వేసుకుంది.

అలాగే కృష్ణా జిల్లాలో రూ.1.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక మహేష్ ‘స్పైడర్’ విడుదలయ్యే వరకు దాదాపు అన్ని థియేటర్లలో ఇదే సినిమా ఉంటుంది కనుక వసూళ్లు ఇలాగే కొనసాగే అవకాశముంది. సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలు ఉండటం, తారక్ ఒకేసారి మూడు పాత్రల్లో నటించడంతో ప్రేక్షకుల్లో సినిమా పట్ల మంచి ఆసక్తి నెలకొని ఉంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించారు.